శుక్రవారం 10 జూలై 2020
National - Jun 24, 2020 , 17:58:10

హ‌ర్యానాలో స్వ‌ల్ప భూకంపం

హ‌ర్యానాలో స్వ‌ల్ప భూకంపం

రోహ‌త‌క్ : హ‌ర్యానాలోని రోహ‌త‌క్ లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 2.8గా న‌మోదైన‌ట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్ల‌డించింది. మ‌ధ్యాహ్నం 12:58 గంట‌ల‌కు సంభ‌వించిన భూకంపంలో ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రోహ‌త‌క్ లో మొత్తం 8 సార్లు భూమి కంపించింది. ఢిల్లీ - ఎన్సీఆర్ స‌రిహ‌ద్దుల్లో 18 సార్లు స్వ‌ల్ప భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రోహ‌త‌క్ ఢిల్లీకి 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. వ‌రుస భూకంపాల‌తో అటు ఢిల్లీ ప్ర‌జ‌లు, ఇటు హ‌ర్యానా ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.


logo