బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 07:21:56

మ‌హారాష్ట్ర‌, జ‌మ్ములో స్వ‌ల్ప భూకంపం

మ‌హారాష్ట్ర‌, జ‌మ్ములో స్వ‌ల్ప భూకంపం

న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌, మ‌హారాష్ట్ర‌లో ఈరోజు తెల్ల‌వారుజామున స్వ‌ల్పంగా భూమి కంపించింది. జ‌మ్ములోని కాత్రాలో శుక్ర‌వారం ఉద‌యం 5.11 గంట‌ల‌కు భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 3.0గా న‌మోద‌య్యింది. క‌త్రాకి తూర్పున 89 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది. వారం రోజుల వ్య‌వ‌ధిలో క‌త్రాలో భూకంపం రావ‌డం ఇది రెండోసారి. జూలై 17న 3.9 తీవ్ర‌త‌తో భూమి కంపించింది. ఈనెల 8న రాజౌరీలో కూడా 4.3 తీవ్ర‌త‌తో భూమికంపం సంభ‌వించింది. 

మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్‌లో భూకంపం వ‌చ్చింది. గురువారం మ‌ధ్య‌రాత్రి 12.26 గంట‌ల‌కు 3.1 తీవ్ర‌త‌తో భూమి కంపించింద‌ని ఎన్‌సీఎస్ వెల్ల‌డించింది.


logo