మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 13:24:10

కరోనా ఆసుపత్రిలో ప్రేమకథ.. వెరీ ఇంట్రెస్టింగ్..!

కరోనా ఆసుపత్రిలో ప్రేమకథ.. వెరీ ఇంట్రెస్టింగ్..!

అమరావతి : కరోనా ఆసుపత్రిలో ప్రేమకథ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజమేనండి బాబు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి మరీ పెళ్లిచేసుకున్నారు. ఇదంతా జరిగింది ఎక్కడంటే.. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఓ యువతికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరి బెడ్లు కూడా పక్కపక్కనే.. దీంతో వీరిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఇక ఆ తర్వాత ఇద్దరి మనసులు కలవడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ టెస్టులు చేస్తే ఇద్దరికి నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తమ ప్రేమకథను తల్లిదండ్రులకు చెప్పారు.

అబ్బాయి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది. అంతే కాదు ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడం, అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తుండడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. దీంతో ఈ నెల 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి ప్రేమకథ మొత్తం పదిరోజుల వ్యవధిలోనే నడిచింది. పెళ్లి కూడా అయ్యింది. ప్రస్తుతం ఈ కరోనా ప్రేమకథ చర్చనీయాంశంగా మారింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo