ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 20:41:27

ఉగ్రవాదంలో భాగమే లవ్ జిహాద్ : యూపీ ఎమ్మెల్యే సంగీత సోమ్

ఉగ్రవాదంలో భాగమే లవ్ జిహాద్ : యూపీ ఎమ్మెల్యే సంగీత సోమ్

లక్నో: లవ్ జిహాద్ ఉగ్రవాదంలో ఒక భాగమని, ఇలాంటి ఘటనలే ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీస్తాయని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంగీత సోమ్ చెప్పారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను అరికట్టడానికి చట్టపరమైన నిబంధనలను తీసుకువస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలనే ప్రకటించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. కొన్ని రోజుల అనంతరం.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్రంలో లవ్‌ జిహాద్‌ను అరికట్టడానికి తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువస్తుందని ప్రకటించారు. 

"లవ్ జిహాద్ ఉగ్రవాదంలో ఒక భాగం. ఇది దేశంలో ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలకు దారితీస్తున్నది" అని సర్దానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒక వీడియో సందేశంలో తెలిపారు. లవ్ జిహాద్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఇలాంటి ఘటనలపై అన్ని రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు