గురువారం 26 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 14:59:15

దేశాన్ని విభ‌జించేందుకే ల‌వ్ జిహాద్ : రాజ‌స్థాన్‌ సీఎం

దేశాన్ని విభ‌జించేందుకే ల‌వ్ జిహాద్ :  రాజ‌స్థాన్‌ సీఎం

హైద‌రాబాద్‌:  దేశాన్ని విభ‌జించేందుకే ల‌వ్ జిహాద్‌ను బీజేపీ సృష్టించిన‌ట్లు  రాజ‌స్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. మ‌త‌ప‌రంగా దేశాన్ని రెండుగా చీల్చేందుకే ల‌వ్ జిహాద్ ప‌దాన్ని బీజేపీ రూపొందించిన‌ట్లు విమ‌ర్శ‌లు చేశారు. పెళ్లిళ్లు, మ‌తాంత‌ర వివాహాలు .. అన్నీ వ్య‌క్తిగ‌త‌మైన స్వేచ్ఛ‌కు సంబంధించిన‌వ‌ని, అయితే ఆ ఆచారాల‌ను అడ్డుకునేందుకు ఎటువంటి చ‌ట్టాలు చేసినా కోర్టులో చెల్ల‌ద‌ని గెహ్లాట్ ఆరోపించారు. అయితే ల‌వ్ జిహాద్ కేసులు ఎక్కువ అవుతున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో ఆ ఘ‌ట‌న‌ల‌ను నియంత్రించేందుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, యూపీ, గుజ‌రాత్‌, క‌ర్నాట‌క రాష్ట్రాలు చ‌ట్టాలు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిప్రాయాల‌ను వెల్ల‌డించిన గెహ్లాట్‌.. ప్రేమ‌లో జిహాద్‌కు చోటు లేద‌న్నారు.   ఇద్ద‌రు ఇష్ట‌ప‌డే వ్య‌క్తులు ఒక్క‌ట‌య్యేందుకు ప్ర‌భుత్వం జోక్యం చేసుకునే విధంగా కొన్ని రాష్ట్రాలు ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు సీఎం గెహ్లాట్ ఆరోపించారు. పెళ్లి అనేది వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని, కానీ దానిపై ఆంక్ష‌ల‌ను విధిస్తున్నార‌ని, అంటే ఇది వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మే అని గెహ్లాట్ అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌త సామ‌ర‌స్యాన్ని దెబ్బ‌తీసేందుకు కుట్ర ప‌న్నార‌ని, స‌మాజంలో అశాంతిని ర‌గిలిస్తున్నార‌ని, రాజ్యాంగ హ‌క్కుల‌ను కాల‌రాసే విధంగా బీజేపీ చ‌ర్య‌లు ఉన్నాయ‌ని గెహ్లాట్ ఆరోపించారు.