ఇక్కడ కమలం వికసించదు: కనిమొళి

రామేశ్వరం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడుకు బీజేపీ నేతల రాకపోకలు పెరిగిపోయాయని డీఎంకే అగ్ర నాయకురాలు, ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. అయితే, బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చివెళ్లారనేది ముఖ్యం కాదని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలువబోతున్నారన్నదే ముఖ్యమని ఆమె చెప్పారు. ఇక్కడ కమలం (బీజేపీ) వికసించే అవకాశమే లేదని, తన సోదరుడు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధించబోతున్నదని ఆమె ధీమా వ్యక్తంచేశారు.
డీఎంకే అధికారంలోకి రాగానే రామసేతు సహా, ప్రజలకు ఉపయోగపడే పలు ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని కనిమొళి ప్రకటించారు. రామేశ్వరంలో డీఎంకే సీనియర్ నాయకుడి ఇంట్లో స్థానిక కార్యకర్తలతో సమావేశమైన ఆమె.. రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే ప్రజల కోసం చేసేందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి కూడా అన్నాడీఎంకే రాష్ట్రాన్ని తగిన రీతిలో అభివృద్ధి చేసుకోలేకపోయిందని కనిమొళి ఎద్దేవా చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.