ఆదివారం 29 మార్చి 2020
National - Feb 13, 2020 , 08:18:36

బస్సును ఢీకొట్టిన లారీ..14 మంది మృతి

బస్సును ఢీకొట్టిన లారీ..14 మంది మృతి

ఫిరోజాబాద్‌:  ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును లారీ డీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా..మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. భదన్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్  వే మీదుగా ప్రైవేట్‌ బస్సు ఢిల్లీ నుంచి బీహార్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్లర్లను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం యోగి పేర్కొన్నారు. 


logo