సోమవారం 18 జనవరి 2021
National - Dec 24, 2020 , 19:20:05

ఇస్కాన్ ఆలయంలో ప్రసాదంగా క్రిస్మస్‌ కేకు

ఇస్కాన్ ఆలయంలో ప్రసాదంగా క్రిస్మస్‌ కేకు

కోల్‌కతా: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్మస్‌ ట్రీలను అలంకరించుకుని బంధువుల, మిత్రులను ఇంటికి ఆహ్వానించి  మిఠాయిలు, కేకులు పంచడం  ఆనావాయితీ. అయితే, జగన్నాథుడితోపాటు బలదేవుడు, సుభద్రలను ప్రతిష్ఠించిన ఆలయంలో క్రిస్మస్‌ కేకును ప్రసాదంగా తేవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ వింత ఆచారాన్ని పశ్చిమ బెంగాల్‌ మాయాపూర్ ఇస్కాన్ ఆలయంలో చూడొచ్చు. 

ఇస్కాన్‌ ఆలయంలోని జగన్నాథుడికి  ప్రతి క్రిస్మస్‌కు భారీ కేక్ అందివ్వడం ఆనవాయితీగా ఉంటుంది. ఈ ఏడాది50 కిలోల బరువు, ఆరున్నర అడుగుల పొడవుతో ఉన్న భారీ  కేకును ప్రసాదంగా అందజేశారు.  ఈ కేక్‌ను చాక్లెట్, వనిల్లా సహా అనేక క్రీములతో తయారు చేయించారు. ఈ కేకును మొంగినిస్‌కు చెందిన ప్రసేన్‌జిత్ సాహాతోపాటు నలుగురు చార్‌ కూక్‌ తయారు చేశారు. తులకి ఆకులను జగన్నాథుడికి అందివ్వడమే కాకుండా కేకు తయారీలో కూడా తులసి ఆకులను వినియోగిస్తారు. ఈ కేక్ పూర్తిగా శాఖాహారం. 

ఇవి కూడా చదవండి..

కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అలా బ‌య‌ట‌ప‌డింది!

పోతూ పోతూ క్షమాభిక్షలు

గిన్నిస్‌ రికార్డుల రారాజు.. రాంకుమార్‌ సారంగపాణి

క్రిస్మస్‌ రోజున ఈ ఐస్‌ ట్రీలు ప్రత్యేకం!

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.