బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 09:32:52

215 అడుగుల‌ ఎత్తైన హ‌నుమాన్ విగ్ర‌హం..

215 అడుగుల‌ ఎత్తైన హ‌నుమాన్ విగ్ర‌హం..

హైద‌రాబాద్‌:  క‌ర్నాట‌క‌లోని హంపిలో భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.  హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం కిష్కిందలో సుమారు 215 ఫీట్ల ఎత్తు ఉన్న విగ్ర‌హాన్ని నిర్మించేందుకు నిర్ణ‌యించారు.  అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ట్ర‌స్టు ఏర్పాటు చేసిన త‌ర‌హాలోనే.. క‌ర్నాట‌క‌లో హ‌నుమాన్ జన్మ‌భూమి తీర్థ‌క్షేత్ర‌ను ఏర్పాటు చేశారు. ట్ర‌స్టు అధిప‌తిగా గోవిందానంద స‌ర‌స్వ‌తి స్వామి ఉంటారు.  అయోధ్య‌లో సుమారు 225 అడుగుల ఎత్తు ఉన్న రాముడి విగ్ర‌హాన్ని నిర్మించాల‌నుకున్నారు.  అయితే రాముడి కంటే ప‌ది ఫీట్లు త‌క్కువ ఎత్తు ఉండే హ‌నుమంతుడి విగ్ర‌హాన్ని కిష్కింధ‌లో ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు.  విగ్ర‌హ నిర్మాణం కోసం దేశ‌వ్యాప్తంగా హ‌నుమాన్ ర‌థ‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ యాత్ర అయోధ్య‌లో ముగుస్తుంది.  కిష్కింధ‌లో విగ్ర‌హ ఏర్పాటు కోసం ప‌ది ఎక‌రాల స్థ‌లాన్ని కొనుగోలు చేయ‌నున్నారు.  వ‌చ్చే బ‌డ్జెట్‌లో సీఎం య‌డ్డీ .. ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించ‌నున్నారు. 

 


logo