శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 11:19:46

ఢిల్లీ అల్ల‌ర్ల‌పై 11న లోక్‌స‌భ‌లో చ‌ర్చిద్దాం..

ఢిల్లీ అల్ల‌ర్ల‌పై 11న లోక్‌స‌భ‌లో చ‌ర్చిద్దాం..

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల అంశంపై చ‌ర్చించాల‌ని ఇవాళ లోక్‌స‌భ‌లో విప‌క్షాలు స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట‌రీ శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి మాట్లాడారు.  లోక్‌స‌భ‌లో ఈనెల 11వ తేదీన ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ త‌ర్వాత రోజున రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ ఉంటుంద‌న్నారు. అయినా విప‌క్ష స‌భ్యులు ప్ర‌శ్నోత్త‌రాలను అడ్డుకున్నారు. విప‌క్ష స‌భ్యులు నినాదాలు ఆప‌క‌పోవ‌డంతో.. స్పీక‌ర్ స‌భ‌ను 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. రాజ్య‌స‌భ‌లో కూడా ఇదే అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేశారు. దీంతో చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు. logo