శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 14, 2020 , 18:32:05

న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లెఖీకి కరోనా పాజిటివ్‌..

న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లెఖీకి కరోనా పాజిటివ్‌..

న్యూ ఢిల్లీ : న్యూఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి లెఖీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ‘ప్రస్తుతం తాను ఆరోగ్యం ఉన్నానని ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వ్యక్తులు కొవిడ్‌-19 పరీక్ష చేయించుకోవాలని ఆమె ట్విట్టర్లో అభ్యర్థించారు. తాము కలిసి పోరాడతాం.. కరోనా జయిస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షలో ఆమెతోపాటు బీజేపీ నాయకులు అనంత్ కుమార్ హెగ్డే, పర్వేశ్‌ సాహెబ్ సింగ్ సహా మరో 16 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ చర్యలతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.