గురువారం 16 జూలై 2020
National - Jun 24, 2020 , 14:15:10

పాత మిడ‌త‌లు చ‌చ్చాయి.. కొత్త మిడ‌త‌లు వ‌చ్చాయి

పాత మిడ‌త‌లు చ‌చ్చాయి..  కొత్త మిడ‌త‌లు వ‌చ్చాయి

న్యూఢిల్లీ: రాజ‌స్థాన్‌లో మిడ‌త‌ల దాడులు కొన‌సాగుతున్నాయి. గ‌త నెల‌న్న‌ర నుంచి మిడ‌త‌లు దాడులు చేస్తూనే ఉన్నాయి. మిడ‌త‌ల దాడులవ‌ల్ల దేశంలో రాజ‌స్థాన్ అత్య‌ధికంగా ప్ర‌భావిత‌మ‌వుతున్న‌ద‌ని ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ బీఆర్ క‌ద్వా తెలిపారు. ఆ మిడ‌త‌ల నిర్మూల‌న‌కు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న‌ చెప్పారు. పాత మిడ‌త‌ల గుంపుల‌ను ఇప్పటికే నిర్మూలించామ‌ని, ఇప్పుడు కొత్త మిడ‌త‌ల గుంపులు వ‌స్తున్నాయ‌ని క‌ద్వా తెలిపారు. పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల నుంచి మిడ‌త‌లు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. 

రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌, జైస‌ల్మేర్‌, బ‌ర్మేర్‌, గంగాన‌గ‌ర్ జిల్లాల్లో మిడ‌త‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని బీఆర్ క‌ద్వా తెలిపారు. మిడ‌త‌ల‌ను నిర్మూలించేందుకు ఆయా ప్రాంతాల్లో కెమిక‌ల్స్ స్ప్రే చేస్తున్న‌ట్లు చెప్పారు.  కమిడ‌తల నిర్మూల‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం నేవీ హెలిక్యాప్ట‌ర్ల‌ను కూడా ఉప‌యోగించ‌నున్న‌ట్లు తెలిపింద‌ని క‌ద్వా వెల్ల‌డించారు.                logo