శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 17:22:56

గ‌దిలో ఊపిరాడ‌క 43 ఆవులు మృతి!

గ‌దిలో ఊపిరాడ‌క 43 ఆవులు మృతి!

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. గ‌దిలో ఊపిరాడ‌క 43 ఆవులు మృతిచెందాయి. బిలాస్‌పూర్ జిల్లా తాఖ‌త్‌పూర్ బ్లాక్ ప‌రిధిలోని మెడ్ప‌ర్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. మెడ్ప‌ర్ గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యం నుంచి దుర్వాస‌న రావ‌డంతో స్థానికులు త‌లుపులు విర‌గ్గొట్టి చూశారు. అందులో భారీ సంఖ్య‌లో ఆవులు కుక్కి ఉండ‌టం చూసి షాక్‌కు గుర‌య్యారు.

గ‌దిలో మొత్తం 60 ఆవులు ఉండ‌గా.. అందులో కేవ‌లం 17 ఆవులు మాత్ర‌మే ప్రాణాల‌తో ఉన్నాయి. మిగ‌తా 43 ఆవులు మృతిచెందాయి. దీంతో గ్రామ‌స్తులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్రివెన్ష‌న్ ఆఫ్‌ క్రూయ‌ల్టీ టు యానిమ‌ల్స్ యాక్ట్‌, ఐపీసీలోని సెక్ష‌న్ 429 ప్ర‌కారం నిందితుల‌పై  కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

కాగా, ఈ ఘ‌ట‌న‌పై బిలాస్‌పూర్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌రాన్స్ మిట్ట‌ర్ విచారం వ్య‌క్తం చేశారు. ఘ‌ట‌నపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని, అంత పెద్ద సంఖ్య‌లో ఆవుల‌ను ఎవ‌రు బంధించారు? ఆ ఆవులు ఎప్ప‌టి నుంచి ఆ గ‌దిలో ఉన్నాయి? వాటిని ఎందుకు బంధించారు? అనే కోణంలో పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo