మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 23:23:56

బెంగళూర్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు ఉండదు : సీఎం యడ్యూరప్ప

బెంగళూర్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు ఉండదు : సీఎం యడ్యూరప్ప

బెంగళూర్‌ :  బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో లాక్‌డౌన్ పొడిగింపు ఉండదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సోమవారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు, క్యాబినెట్ మంత్రులతో సమావేశం అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరులో వార్డుస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది. నగరంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 15నుంచి కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయగా జూలై 22 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. కర్ణాటకలో సోమవారం కొత్తగా 3,648 కరోనా  కేసులు నమోదుకాగా  72 మృతి చెందారు. బెంగళూర్‌ నగరంలో ఇవాళ 1,452 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 31 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 42,216 యాక్టివ్‌ కేసులుండగా 1,403 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ తెలిపింది.


logo