మంగళవారం 19 జనవరి 2021
National - Jun 12, 2020 , 16:25:43

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ పొడిగించబోం

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ పొడిగించబోం

ముంబై : మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ పొడిగింపు విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం స్పష్టతనిచ్చింది. మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు ఉద్దేశం లేదని పేర్కొంది. కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు గుమిగూడొద్దని ఆదేశించింది. 

‘ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పునఃప్రకటించే అవకాశం లేదు. ప్రజలు ఎక్కడా గుమిగూడొద్దు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలి. మీ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా ఆ రాష్ట్రంలో ఈనెలాఖరు వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రంలో ఇప్పటివరకు 97,648 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంరక్షణ మంత్రిశాఖ వెల్లడించింది.