మంగళవారం 14 జూలై 2020
National - Jun 19, 2020 , 08:11:02

ఆ నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ పొడిగింపు

ఆ నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ పొడిగింపు

చెన్నై : త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఆ రాష్ర్టంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌టంతో.. స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో క‌రోనా పాజిటివ్ కేసులు అత్య‌ధికంగా న‌మోదు అవుతున్న జిల్లాల్లో మ‌రోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

త‌మిళ‌నాడులోని చెన్నై, చెంగ‌ల్ పేట‌, కంచీపురం, తిరువ‌ళ్లూరులో జూన్ 30వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ను పొడిగించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాల‌ని అధికారులు సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 

తమిళ‌నాడు రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 52,334 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కొవిడ్-19తో 625 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా పాజిటివ్ కేసుల్లో దేశంలో మహారాష్ర్ట ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, త‌మిళ‌నాడు రెండో స్థానంలో ఉంది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,81,091 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 12,604 మంది చ‌నిపోయారు. అత్య‌ధికంగా మ‌హారాష్ర్ట‌లో 1,20,504 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అక్క‌డ 5,751 మంది ప్రాణాలు విడిచారు. 


logo