శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 01:31:51

అంతటా లాక్‌డౌన్‌

అంతటా లాక్‌డౌన్‌

  • 15కిపైగా రాష్ర్టాల్లో అమలు
  • ప్రజలు నిబంధనలు పాటించేలా చూడండి: కేంద్రం ఆదేశం
  • తొమ్మిదికి చేరిన మృతులు.. 468 మంది బాధితులు

న్యూఢిల్లీ: దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరో నాను అడ్డుకునేందుకు 15పైగా రాష్ర్టాలు అత్యవసర సర్వీసులు మినహా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ప్రజలు నిబంధనలు పా టించేలా చూడాలని కేంద్రం రాష్ర్టాలను ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేయాలన్నది. దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ర్టాల్లో కేరళ, హర్యానా, పంజాబ్‌, తమిళనాడు, మణిపూర్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, నా గాలాండ్‌, తెలంగాణ, చండీగడ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. ఇప్ప టికే లాక్‌డౌన్‌ ప్రకటించిన పంజాబ్‌లో కర్ఫ్యూ విధిస్తూ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా కర్ఫ్యూ విధించిన తొలి రాష్ట్రంగా పంజాబ్‌ నిలిచింది. మహారాష్ట్రలోని ముంబై, పుణె, ఠాణెల్లో ఈ నెల 31 వరకు కర్ఫ్యూ విధించగా, ముంబై లోకల్‌ రైళ్లు నిలిపివేశారు. 

పెరుగుతున్న కేసులు

సోమవారానికి దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య 468కు పెరిగింది. ఇప్పటివరకు తొమ్మిదిమంది మరణించారు. సోమవారం పశ్చిమబెంగాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకటి చొప్పున మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల్లో 40 మంది విదేశీయులున్నారు. మహారాష్ట్రలో 74, కేరళలో 67, కర్ణాటకలో 33, తెలంగాణలో 32, యూపీలో 31, గుజరాత్‌లో 29, ఢిల్లీలో 29, రాజస్థాన్‌లో 28  కేసులు నమోదైనట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 68 ఏండ్ల వృద్ధుడు ఈ నెల 13న ముంబైలోని కస్తూర్బా ప్రభుత్వ దవాఖానలో చేరాడు. అతడికి  కరోనా సోకినట్టు తేలింది. తర్వాత అత డు కోలుకోవడంతో ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. ఇతర కారణాల వల్ల మృతిచెందారని అధికారులు తెలిపారు. 
logo