శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 20:27:43

కేర‌ళ‌లో ఏడాదిపాటు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు!

కేర‌ళ‌లో ఏడాదిపాటు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు!

తిరువ‌నంత‌పురం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్ర‌భుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న‌ది. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను మరో ఏడాదిపాటు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు క‌రోనా నియంత్ర‌ణ కోసం కొత్త మార్గదర్శకాలు, నిబంధనలను తీసుకొచ్చింది. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా‌ జారీచేసింది.

ఇక పనిప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య క‌చ్చితంగా ఆరు అడుగుల దూరం పాటించాలని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న‌ది. వచ్చే ఏడాదిపాటు ఈ నిబంధనలు పాటించాల‌ని స్పష్టం చేసింది. వివాహాలకు గరిష్టంగా 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. ఎక్కువ మంది సమావేశమయ్యే సందర్భాలుంటే స్థానిక యంత్రాంగం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల‌ని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్షలు విధించ‌నున్న‌ట్లు తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo