మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 06:36:32

యూపీలో వారాంతరాల్లో లాక్‌డౌన్‌

యూపీలో వారాంతరాల్లో లాక్‌డౌన్‌

లక్నో: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారాంతరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే శనివారం నుంచి అమల్లోకి రానున్న లాక్‌డౌన్‌ ఈ నెల చివరిక వరకు కొనసాగనుందని అధికారులు ప్రకటించారు. ప్రత్యేకంగా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నామని వెల్లడించారు. వారాంతరాలైన శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసి ఉంటాయని తెలిపారు. ప్రధానంగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికే లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 35,092 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 913 మంది మరణించగా, కరోనా బారినపడిన 22,689 మంది బాధితులు కోలుకున్నారు. మరో 11,490 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


logo