శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 11:55:42

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో రాజ‌ధానిస‌హా ప‌ది జిల్లాల్లో లాక్‌డౌన్‌

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో రాజ‌ధానిస‌హా ప‌ది జిల్లాల్లో లాక్‌డౌన్‌

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది.   రాజ‌ధాని రాయ్‌పూర్ స‌హా ప‌ది జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. రాయ్‌పూర్‌తోపాటు జ‌ష్‌పూర్‌, బ‌లోడా బ‌జార్‌, జంజ్గిర్‌-ఛంపా, దుర్గ్‌, భిలాయ్‌, ధంతారి, బిలాస్‌పూర్ జిల్లాల్లో సెప్టెంబ‌ర్ 28 వ‌ర‌కు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

రాయ్‌పూర్‌లో అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్నాయి. జిల్లాలో ప్ర‌తిరోజు వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ఇప్ప‌టివ‌రకు మొత్తం 26 వేల కేసులు రికార్డ‌య్యాయి. దీంతో రాయ్‌పూర్ జిల్లా మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించింది. 

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 86,183 క‌రోనా కేసులునమోద‌వ‌గా, 677 మంది మ‌ర‌ణించారు. 37,853 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 47,653 మంది బాధితులు కోలుకున్నారు.