మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 16:59:29

కశ్మీర్‌ లోయలో ఆరు రోజుల పాటు లాక్‌డౌన్‌

కశ్మీర్‌ లోయలో ఆరు రోజుల పాటు లాక్‌డౌన్‌

కశ్మీర్‌ : కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కశ్మీర్‌లోయలో అధికారులు ఆరురోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 15 వేలకు పైగా కేసులు నమోదు కాగా 260 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఒక్క బండిపోరా జిల్లా మాత్రమే కాకుండా మొత్తం కశ్మీర్‌ లోయలో లాక్‌డౌన్‌ విధించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, నిర్మాణ పనులతో పాటు అత్యవసర సేవలన్నీ కొనసాగించవచ్చని అధికారులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo