బుధవారం 03 జూన్ 2020
National - Apr 11, 2020 , 00:51:49

పంజాబ్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు

పంజాబ్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు

చండీగఢ్‌: పంజాబ్‌లో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం అమరీందర్‌ సింగ్‌ శుక్రవారం మంత్రులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించడమే ఉత్తమమని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అనంతరం ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

జార్ఖండ్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇండ్లల్లోనే ఉంటున్న ప్రజలకు బోరుకొట్టకుండా ఉండేందుకు జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా యంత్రాంగం రకరకాల వస్తువుల తయారీపై ఆన్‌లైన్‌ పోటీలను నిర్వహిస్తున్నది. 

రాజస్థాన్‌: పేదలకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవడం.. వీడియోలు చిత్రీకరించడంపై రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌ జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది.

ఉత్తరప్రదేశ్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు 13,200 మందిపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. రూ.5.87 కోట్ల జరిమానాలను వసూలు చేశారు.

కర్ణాటక: రెండు మున్సిపల్‌వార్డులను 14 రోజులపాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక కమిషనర్‌ అనిల్‌కుమార్‌ చెప్పారు. ఈ వార్డుల్లో ఐదు కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

కేరళ: డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది కోసం కేరళలోని సెంట్రల్‌ జైలు ఖైదీలు యూనిఫాంలను తయారు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో వీళ్లు ఇప్పటికే భారీగా మాస్క్‌లను తయారు చేశారు.

 మహారాష్ట్ర: నిత్యావసరాలను ఉత్పత్తి చేసే దాదాపు 338 కంపెనీలు తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది.


logo