సోమవారం 01 జూన్ 2020
National - May 17, 2020 , 18:16:17

మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. తాజా నిర్ణయంతో మరో 14  రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.  వైరస్‌ నిర్మూలన చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలవుతోంది.  ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర  ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఈనెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. 

కేంద్రం విధించిన మూడో విడత లాక్‌డౌన్‌ ఇవాళ్టితో ముగియనుంది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వం మే 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన విషయం తెలిసిందే.  మరికాసేపట్లో కేంద్రం నూతన మార్గదర్శకాలు కూడా విడుదల చేయనుంది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విప‌త్క‌ర  పరిస్థితుల్లో మ‌రికొన్నిరోజులు లాక్‌డౌన్ కొనసాగిస్తేనే వైరస్‌ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని కేంద్రం భావిస్తున్నది. 


logo