గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 18:29:46

సిక్కింలో లాక్‌డౌన్‌ పొడిగింపు

సిక్కింలో లాక్‌డౌన్‌ పొడిగింపు

గ్యాంగ్‌టక్‌: కరోనా కట్టడి కోసం ఈశాన్య రాష్ట్రం సిక్కిం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. ఆగస్టు 1, ఉదయం ఆరుగంటల వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ  ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా, రాష్ట్రంలో కొవిడ్‌ మార్గదర్శకాలతోపాటు జూలై 27 వరకు లాక్‌డౌన్‌ అమలుకు ఈ నెల 20 తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఇప్పుడు పరిస్థితిని గమనించి, లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించింది. అలాగే, ఈ కాలంలో మార్గదర్శకాలు అమలవుతూనే ఉంటాయని తెలిపింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo