శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 14:56:55

బీహార్‌లో ఆగ‌స్టు 16 వ‌ర‌కు లాక్‌డౌన్

బీహార్‌లో ఆగ‌స్టు 16 వ‌ర‌కు లాక్‌డౌన్

పాట్నా: బీహార్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆగ‌స్టు 16 వ‌ర‌కు పొడిగించారు. ఆగ‌స్టు 1 నుంచి ఇది అమ‌లులోకి వ‌స్తుంద‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ప్రైవేటు సంస్థ‌లు 50 శాతం సిబ్బందితో ప‌నిచేస్తాయ‌ని తెలిపింది. ద‌వాఖాన‌లు, వైద్య సేవ‌ల‌కు ఎలాంటి ఆంక్ష‌లు లేవ‌ని పేర్కొంది. అన్ని ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్తంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. విద్య‌, సాంస్క‌`తిక, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని సూచించింది. ఈ నిబంధ‌న‌లు ఆగ‌స్టు 1 నుంచి 16 వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని పేర్కొంది. బీహార్‌లో క‌రోనా కేసుల సంఖ్య 41 వేలు దాట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 253 మంది మ‌ర‌ణించారు.


తాజావార్తలు


logo