శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 11:56:35

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉద్యోగం లేదు

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉద్యోగం లేదు

న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ సడలించిన తరువాత ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగిగా మారారు. ఐఏఎన్‌ఎస్‌- కొవిడ్‌ సీఓటర్‌ 1,723మందిని సర్వే చేయగా 21.57 శాతం మంది ప్రజలు పూర్తిగా నిరుద్యోగులుగా మారారట. 25.92 శాతం మంది ఇప్పటికీ అదే జీతంతో నిబంధనలు, భద్రతా చర్యల కింద పనిచేస్తున్నారని, 7.09 శాతం మంది జీతం తగ్గించుకొని వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారని సర్వే సూచించింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. జూన్ 1 నుంచి అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సర్వే జూన్ 24 నుంచి 22 వరకు జరిగింది. ఈ సర్వే ప్రకారం 8.33 శాతం మంది ప్రజల ఆదాయం తగ్గిందట. కాని వారు నిబంధనలు, భద్రతా చర్యల ప్రకారం పనిచేస్తున్నారు. 8 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తున్న వారు జీతం కోతలు, ఆదాయంలో తగ్గుదల ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్‌ సడలించిన తరువాత దేశంలో 6.12 శాతం మందికి ఆదాయం లేదని, 1.20 శాతం మంది తమ పనులను కొనసాగిస్తున్నప్పటికీ జీతం మాత్రం లభించడం లేదని సర్వే సూచించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo