బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 13:31:25

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. భారీగా తగ్గిన ఎక్సైజ్‌ ఆదాయం..

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. భారీగా తగ్గిన ఎక్సైజ్‌ ఆదాయం..

బెంగళూరు : కరోనా మహమ్మారి కర్ణాటక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎక్సైజ్ ఆదాయంలో భారీగా దెబ్బ కొట్టింది. అధికారిక లెక్కల ప్రకారం 2020,21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎక్సైజ్ శాఖ వసూలు చేసిన ఆదాయం 3,846.76 కోట్లు కాగా గతేడాది ఇదే కాలానికి రూ .5,760.14 కోట్ల ఆదాయం వచ్చింది. 2019తో పోలిస్తే 2020లో రూ.1,913.38 కోట్ల ఆదాయం తగ్గింది. 

ఓ ఎక్సైజ్‌ అధికారి మాట్లాడుతూ ఏప్రిల్, జూన్ మధ్య 33.22% ప్రతికూల వృద్ధి ఉంది. పూర్తి లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో ఆదాయం రాలేదు. దుకాణాలు మూసేయడం వల్ల ప్రభుత్వం రూ.2,300 కోట్లు నష్టపోయిందన్నారు.  

గత మూడు నెలలతో పోలిస్తే కర్ణాటకలో ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) అమ్మకాలు కూడా 33.88 శాతం కుప్పకూలిపోయాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఐఎంఎల్ అమ్మకాలు రూ.100.76 లక్షల కేసులు కాగా, గత సంవత్సరంలో రూ.152.38 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. రిటైల్ మద్యం దుకాణాలు (సీఎల్ 2), ఎంఎస్ఐఎల్ దుకాణాలను మే 4 నుంచి తెరవడానికి అనుమతించారు, కానీ ప్రభుత్వం మే 7న అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ)ను ఐఎంఎల్ మొత్తం 18 స్లాబులపై 17% నుంచి 21%, 25% పైన పెంచింది. 6 శాతం ఏఈడీను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo