బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 17:09:54

పోలీసుల‌కు 24 గంట‌ల్లో 781 కాల్స్‌

పోలీసుల‌కు 24 గంట‌ల్లో 781 కాల్స్‌

న్యూఢిల్లీ:  నిన్న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల్లో ఢిల్లీ పోలీస్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌కు 781 కాల్స్ వ‌చ్చాయి. వీటిలో 394 కాల్స్ తాము ఊరికి వెళ్ల‌డానికి పాస్‌లు కావాల‌ని, 73 కాల్స్ ఆహారం, డ‌బ్బులు కావాల‌ని చేశార‌ని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి స‌హాయం కోసం ఢిల్లీ పోలీసులు 011-2349526 హెల్ప్‌లైన్ నెంబ‌ర్ ఏర్పాటు చేశారు. ఇది 24 గంట‌లు ప‌నిచేస్తుంది. హెల్ప్‌లైన్ నెంబ‌ర్ ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి మొత్తం 41,788 కాల్స్ వ‌చ్చాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. 


logo