శుక్రవారం 05 జూన్ 2020
National - May 07, 2020 , 15:35:38

181 ఏండ్లకు తొలిసారి అన్నదానం బంద్‌

181 ఏండ్లకు తొలిసారి అన్నదానం బంద్‌

లక్నో: రంజాన్‌ పర్వదినం సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తే పుణ్యం వస్తుందని ముస్లిం మతపెద్దలు బోధిస్తుంటారు. ఈ రంజాన్‌ మాసం అంతా ప్రతిచోటా అన్నదానాలు విరివిగా జరుగుతుంటాయి. అయితే, 180 ఏండ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిన అన్నదానం.. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా తొలిసారి నిలిపివేయాల్సి వచ్చింది.

1839లో అవధ్‌ రాజ్యానికి చెందిన మూడో రాజు మహమ్మద్‌ అలీషా.. లక్నో నగరంలో హుస్సేనాబాద్‌ ఎండోమెంట్‌ను ప్రారంభించి ఛోటా ఇమాంబారా మసీదులో 'బావార్చిఖానా' ఏర్పాటుచేసి రంజాన్‌ పర్వదినాన అన్నదానం చేయడం మొదలెట్టాడు. ఆనాటి నుంచి గత ఏడాది వరకు నివరధికంగా వేలాది మందికి అన్నదానం చేసిన ఈ మసీదు ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా 180 ఏండ్లలో తొలిసారి అన్నదానం బంద్‌ అయింది. ప్రార్థనలు చేసేందుకు వచ్చిన ఒకరిద్దరు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నారు.


logo