గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 12:50:03

బీహార్‌లో మ‌ళ్లీ ప్రారంభ‌మైన లాక్‌డౌన్‌

బీహార్‌లో మ‌ళ్లీ ప్రారంభ‌మైన లాక్‌డౌన్‌

హైద‌రాబాద్‌: బీహార్‌లో మ‌ళ్లీ ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. జూలై 31వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంది. కోవిడ్‌19 కేసులు పెరిగిన నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  గ‌త మూడు వారాల్లో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరిగాయి. కేవ‌లం నిత్య‌వ‌స‌ర స‌ర్వీసులు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. ప్ర‌భుత్వం ఆఫీసులు, ప‌బ్లిక్ కార్పొరేష‌న్లు, విద్యా సంస్థులను మూసివేస్తున్నారు. ప్రైవేటు, క‌మ‌ర్షియ‌ల్ వ్యాపార కేంద్రాలు కూడా బంద్ ఉంటాయి. రేష‌న్ షాపులు, డెయిరీ, కూర‌గాయ‌లు, మాంసం షాపులు మాతం లాక్‌డౌన్ నుంచి మిన‌హాయించారు. ఆల‌యాల‌ను, ప్రార్థ‌నా మందిరాల‌ను మూసివేశారు.  ఈ-కామ‌ర్స్ , హోం డెలివ‌రీకి అవ‌కాశం క‌ల్పించారు. లాక్‌డౌన్ వేళ ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు అనుమ‌తి ఇస్తున్నారు.  కేవ‌లం నిత్యావ‌స‌ర వ‌స్తువుల స‌ర‌ఫరా కోసం ప్రైవేటు వాహ‌నాల‌ను అనుమ‌తిస్తారు. వ్య‌వ‌సాయ సంబంధింత ప‌నుల‌కు ఓకే చెప్పారు. రైళ్లు, విమాన స‌ర్వీసులు, నిర్మాణ సంబంధిత కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తిచ్చారు. 20 వేల మందికి వైర‌స్ సోక‌గా, 13 వేల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మ‌ర‌ణాల సంఖ్య 174గా ఉన్న‌ది. 

   logo