గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 18:00:12

ఆగ‌స్టులో 9 రోజుల‌పాటు పూర్తిగా లాక్‌డౌన్‌

ఆగ‌స్టులో 9 రోజుల‌పాటు పూర్తిగా లాక్‌డౌన్‌

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌ బెంగాల్‌లో అమ‌లు చేస్తున్న వారంలో రెండు రోజుల సంపూర్ణ రాష్ట్ర‌వ్యాప్త లాక్‌డౌన్‌ను ఆగ‌స్టు 31 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు నెల‌లో 9 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌ని చెప్పారు. బ‌క్రీద్ నేప‌థ్యంలో ఆగ‌స్టు 1న ఎలాంటి లాక్‌డౌన్ ఉండ‌బోద‌ని మ‌మ‌త తెలిపారు. ఆగ‌స్టు 2, 5, 8, 9, 16, 17, 23, 24, 31 తేదీల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తామ‌ని ఆమె చెప్పారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో క‌రోనా కేసుల సంఖ్య 60 వేలు దాట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 1,411 మంది మ‌ర‌ణించారు.
logo