ఆదివారం 12 జూలై 2020
National - May 29, 2020 , 13:37:55

మ‌రో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాలి: ‌గోవా సీఎం

మ‌రో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాలి: ‌గోవా సీఎం

ప‌నాజీ: నాలుగో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు మే 31తో ముగియ‌నున్న నేప‌థ్యంలో మ‌రో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ పేర్కొన్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడి త‌న అభిప్రాయం వెల్ల‌డించిన‌ట్లు చెప్పారు. అయితే, అదే స‌మ‌యంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ, 50 శాతం కెపాసిటీతో రెస్టారెంట్లను తెరుచుకునేందుకు ఐదో విడ‌త లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇవ్వాల‌ని హోంమంత్రిని కోరిన‌ట్లు సావంత్ తెలిపారు. 

అదేవిధంగా జిమ్‌ల‌ను తెరుచుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కూడా చాలా మంది నుంచి విన‌తులు వ‌స్తున్నాయ‌ని గోవా ముఖ్య‌మంత్రి చెప్పారు. దేశంలో నాలుగు విడ‌త‌లుగా లాక్‌డౌన్ విధించినా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేద‌ని, అందుకే మ‌రో 15 రోజుల‌పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని తాను కేంద్ర హోంమంత్రిని కోరాన‌ని గోవా సీఎం సావంత్ చెప్పారు.   


logo