ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 21:24:25

బెంగాల్‌లో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

బెంగాల్‌లో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పలు సడలింపులతో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ ప్రభుత్వం పొడగించింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసి ఉంచనున్నట్లు తెలిపింది. ఇందులో అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు అలాగే విశ్వవిద్యాలయాలున్నాయని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి ఛటర్జి ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ కొల్‌కతాలోని నబన్నాలో రాష్ట్రంలో కొవిడ్‌-19 పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో బీజేపీ పశ్చిమ బెంగాల్ యూనిట్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి మనోజ్, భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి స్వపన్ బెనర్జీ, కాంగ్రెస్ నుంచి ప్రదీప్ భట్టాచార్య పాల్గొన్నారు. నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ను సడలింపులతో జూలై చివరి వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ జూన్‌ 30తో ముగియనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 14,728 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo