బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 18:20:24

ప‌శ్చిమ‌బెంగాల్‌లో లాక్‌డౌన్ పొడిగింపు

ప‌శ్చిమ‌బెంగాల్‌లో లాక్‌డౌన్ పొడిగింపు

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ది. మ‌న దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. అందులో ప‌శ్చిమ‌బెంగాల్ కూడా ఒక‌టి. ప‌శ్చిమ‌బెంగాల్‌లో లాక్‌డౌన్‌ను జూలై 31 వ‌ర‌కు పొడిగించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. 

అయితే, పొడిగించిన లాక్‌డౌన్ కాలంలో ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయ‌ని, రాత్రి 10 నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని బెంగాల్ సీఎం తెలిపారు. అదేవిధంగా జూలై 1 నుంచి సీటింగ్ కెపాసిటీ వ‌ర‌కు ప్యాసింజ‌ర్ల‌ను అనుమ‌తిస్తూ మెట్రోరైళ్ల‌ను న‌డిపించే విష‌య‌మై కోల్‌క‌తా మెట్రోరైల్ అథారిటీ అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని మ‌మ‌తాబెన‌ర్జీ చెప్పారు.  logo