గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 16:41:15

త‌మిళ‌నాడులో మే 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌

త‌మిళ‌నాడులో మే 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌

చెన్నై: త‌మిళ‌నాడులో లాక్‌డౌన్‌ను మ‌రింత పొడిగించారు. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను మే 31 వ‌రకు పొడిగిస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు నూత‌న ఆదేశాలు జారీచేసింది. మే 31 వ‌ర‌కు స్కూళ్లు, కాలేజీలు, ఇత‌ర రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు మూసి ఉంటాయ‌ని.. ఆల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చిలు కూడా తెరుచుకోవని ప్ర‌భుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొన్న‌ది. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో భాగ‌మైన విమానాలు, రైళ్లు, బ‌స్సులు కూడా మే 31 వ‌ర‌కు తిరుగ‌వ‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసింది. పెండ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని తెలిపింది.


logo