గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 14:18:44

మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు

మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించారు. మే 31 వ‌ర‌కు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు మ‌హారాష్ట్ర చీఫ్ సెక్రెట‌రీ అజోయ్ మెహ‌తా వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆదివారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 1897 నాటి అంటు వ్యాధుల చ‌ట్టంలోని సెక్ష‌న్ 2తోపాటు, 2005 నాటి విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం ప్ర‌కారం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

మూడో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు నేటితో ముగియ‌నున్న నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. మే 31న అర్ధ‌రాత్రి వ‌ర‌కు నాలుగో విడ‌త లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. కాగా, మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 30,706 కేసులు న‌మోద‌య్యాయ‌ని, వారిలో 1135 మంది మ‌ర‌ణించ‌గా 7,088 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. 


logo