ఆదివారం 12 జూలై 2020
National - May 31, 2020 , 11:46:05

త‌మిళ‌నాడులో జూన్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌

త‌మిళ‌నాడులో జూన్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌

చెన్నై: త‌మిళ‌నాడులో లాక్‌డౌన్‌ను జూన్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, మొత్తం రాష్ట్రాన్ని 8 జోన్లుగా విభ‌జించి స‌డ‌లింపుల‌తో కూడాని లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఎనిమిది జోన్ల‌కుగాను మొద‌టి ఆరు జోన్ల‌లో స‌డలింపులు 50 శాతం ప్ర‌జా ర‌వాణాకు అనుమతించ‌నున్న‌ట్టు త‌మిళ‌నాడు స‌ర్కారు స్ప‌ష్టంచేసింది. అంటే ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన బ‌స్సుల్లో 50 శాతం బ‌స్సుల‌ను జూన్ 1 నుంచి న‌డుప‌నుంది. 

అంతేగాక‌, మొద‌టి ఆరు జోన్ల‌లో అవస‌రాల‌ నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి వెళ్లే  వారు ఎలాంటి పాస్‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఆటోలు, ట్యాక్సీల్లో డ్రైవ‌ర్‌తోపాటు ముగ్గురికి మించ‌కుండా ప్ర‌యాణికులు వెళ్లొచ్చ‌ని తెలిపింది. అదేవిధంగా ఐటీ కంపెనీలు, ఐటీ ఎనేబుల్డ్ స‌ర్వీసులను కూడా 20 శాతం ఉద్యోగులతో న‌డుపుకోవ‌చ్చ‌ని పేర్కొన్న‌ది. అయితే గ‌రిష్టంగా  40 మందికి మించొద్ద‌ని సూచించింది. జోన్ 7, 8 ల‌కు మాత్రం తాజా సడ‌లింపులు వ‌ర్తించ‌వ‌ని తెలిపింది.         


logo