గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 17:32:37

ర‌బ్బ‌ర్ ట్యూబ్‌పై ఆస్ప‌త్రికి గ‌ర్భిణి.. వీడియో

ర‌బ్బ‌ర్ ట్యూబ్‌పై ఆస్ప‌త్రికి గ‌ర్భిణి.. వీడియో

ప‌ట్నా: ఉత్త‌రాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేకుండా వ‌ర్షాలు అక్క‌డి ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి. కొన్ని గ్రామాల ప్ర‌జ‌ల‌కు కొండ చ‌రియ‌లు విరిగిప‌డి రోడ్లు మూసుకుపోతే, మ‌రికొన్ని గ్రామాలు వ‌ర‌ద గుప్పిట్లో చిక్కుకోవ‌డంతో ప్ర‌జ‌లు ఊరుదాటి బ‌య‌టికి రాలేని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ ఉద‌యం ఉత్తరాఖండ్‌లో ఓ పేషెంట్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. అయితే ఆ గ్రామానికి ఉన్న ఏకైక మార్గంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో.. అత‌న్ని ఆస్ప‌త్రికి చేర్చ‌డానికి బంధువులు నానా అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌చ్చింది. 

తాజాగా బీహార్ రాష్ట్రం ద‌ర్భంగా జిల్లాలోని అషారా గ్రామంలో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా అషారా గ్రామం పూర్తిగా జ‌ల‌దిగ్బంధ‌నంలో చిక్కుకుంది. ఊరు చుట్టూ దాదాపు ఆరు అడుగుల లోతున నీరు నిలిచింది. అయితే, ఇదే స‌మ‌యంలో ఆ గ్రామానికి చెందిన ఓ మ‌హిళకు పురిటినొప్పులు వ‌చ్చాయి. దీంతో కుటుంబ‌స‌భ్యులు, స్థానికులు ఆమెను రబ్బ‌ర్ ట్యూబ్‌తో తయారు చేసిన చేతి ప‌డ‌వ‌పై ఆస్ప‌త్రికి త‌ర‌లించాల్సి వ‌చ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు. 

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo