శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 07:54:35

ఈ రంగు తాబేలును ఎప్పుడూ చూసి ఉండరు!

ఈ రంగు తాబేలును ఎప్పుడూ చూసి ఉండరు!

భువనేశ్వర్‌ : ఇప్పటి వరకు చూసిన తాబేళ్లు వేరు.. ఈ తాబేలు వేరు. ఈ రంగు తాబేలును ఎప్పుడూ చూసి ఉండరు! ఈ తాబేలు మొత్తం పసుపు వర్ణంలో ఉంది. చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. కొంచెం వెలుతురులో అయితే బంగారంలా మెరిసిపోతోంది.

బాలాసోర్‌ జిల్లాలోని సోరో బ్లాక్‌లోని సుజన్‌పూర్‌ గ్రామస్తుల చేతికి పసుపు వర్ణంలో ఉన్న తాబేలు చిక్కింది. దీంతో అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించి.. తాబేలును అప్పజెప్పారు. ఈ సందర్భంగా వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ భానుమిత్ర ఆచార్య మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇలాంటి రంగులో తాబేలును చూడలేదన్నారు. ఇది అరుదైన తాబేలు అని తెలిపారు. 

గత నెలలో కూడా ఒడిశా మయూర్‌భంజ్‌ జిల్లాలోని ద్యూలీ డ్యాం వద్ద జాలర్లకు ట్రియంకిడియా అతే జాతికి చెందిన తాబేలు చిక్కింది. దీన్ని కూడా ఫారెస్టు అధికారులకు అప్పగించగా.. అదే డ్యాంలో వదిలిపెట్టారు. ఈ రకం తాబేలు పూర్తిస్థాయిలో మృదువైన షెల్‌ను కలిగి ఉంటుంది. ఇలాంటి తాబేళ్లు అధికంగా ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి బరువు 30 కేజీలకు పైగా ఉంటుంది. జీవితకాలం వచ్చేసి 50 సంవత్సరాలు అని అధికారులు తెలిపారు.


logo