బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 07:22:59

హెల్త్‌ వర్కర్లపై రాళ్లతో దాడి.. వీడియో

హెల్త్‌ వర్కర్లపై రాళ్లతో దాడి.. వీడియో

భోపాల్‌ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఇతర దేశాలకు, రాష్ర్టాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు తెలుసుకుని, వారిని స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని తాత్పట్టి బఖల్‌ ఏరియాలో ఉన్న ప్రజలను స్క్రీనింగ్‌ చేసేందుకు హెల్త్‌ వర్కర్లు వెళ్లారు. అక్కడున్న జనం.. హెల్త్‌ వర్కర్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా హెల్త్‌ వర్కర్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన హెల్త్‌ వర్కర్లు దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తారు. ఒక్క ఇండోర్‌ పట్టణంలోనే 12 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 98కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2014 కాగా, 56 మంది మృతి చెందారు.


logo