శనివారం 06 జూన్ 2020
National - May 15, 2020 , 16:33:03

మాస్క్‌ ధరించాలన్నందుకు పోలీసులపై దాడి

మాస్క్‌ ధరించాలన్నందుకు పోలీసులపై దాడి

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో స్థానికులు కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడమే గాక, నిలదీసిన పోలీసులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ముంబై పోలీస్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ప్రణయ్‌ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నగరం అంటాప్‌ హిల్స్‌లోని గరీబ్‌ నవాజ్‌ ఏరియాలో గురువారం రాత్రి కొందరు ముఖాలకు మాస్కులు లేకుండా రోడ్లపై ఉండటాన్ని పోలీసులు గమనించారు. ముఖాలకు మాస్కుల ఎందుకు ధరించలేదని పోలీసులు ప్రశ్నించడంతో వారు వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగక పదునైన ఆయుధాలు తీసుకొచ్చి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసుల తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo