శనివారం 04 జూలై 2020
National - Jul 01, 2020 , 10:01:57

ముంబైలో ప్రారంభమైన లోకల్‌ రైళ్లు

ముంబైలో ప్రారంభమైన లోకల్‌ రైళ్లు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్థానిక రైళ్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నేటినుంచి అన్‌లాక్‌-2 అమల్లోకి రావడంతో ముంబైలో 350 లోకల్‌ రైళ్లను రైల్వేశాఖ నడుపుతున్నది. అయితే వీటిలో ప్రయాణించేందుకు అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మహారాష్ట్ర సర్కార్‌ అనుమతించింది. సాధారణ ప్రయాణికులకు వీటిలో ప్రయాణించే అవకాశం ప్రస్తుస్తానికి లేదని ప్రటించింది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ఐటీ, జీఎస్టీ, పోస్టల్‌, జాతీయ బ్యాంకులు, ముంబై పోర్టు ట్రస్ట్‌, న్యాయ, రాజ్‌భవన్‌ ఉద్యోగులు ఎంపికచేసిన సబర్బన్‌ రైళ్లలో ప్రయాణించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అత్వసర సేవల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారి కోసమే ఈ రైళ్లు నడుపుతున్నట్లు సెంట్రల్‌ రైల్వే పేర్కొంది. అవసరాలకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచుతామని, ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనలను పాటించాలని తెలిపింది. 


logo