చెన్నై: సినీ నటులు రీల్ హీరోలుగానే కాకుండా రియల్ హీరోలుగా కూడా ఉండాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సకాలంలో పన్ను చెల్లించి ఆదర్శంగా నిలవాలని సూచించింది. 2012లో తాను కొనుగోలు చేసిన రూ.7.95 కోట్ల ఖరీదుచేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ తమిళ సినీ నటుడు విజయ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. పన్ను కట్టనందుకు రూ.లక్ష జరిమానా విధించింది.