e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జాతీయం లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ పాశ్వాన్ లేఖ‌

లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ పాశ్వాన్ లేఖ‌

లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ పాశ్వాన్ లేఖ‌

పాట్నా: బీహార్‌కు చెందిన లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు బుధ‌వారం లేఖ రాశారు. త‌న స్థానంలో పశుప‌తి కుమార్ ప‌రాస్‌ను లోక్‌స‌భ‌లో ఎల్జేపీ నేత‌గా ప్ర‌క‌టించ‌డం త‌మ‌ పార్టీ నిబంధ‌ల‌న‌కు విరుద్ధ‌మ‌ని తెలిపారు. పార్టీ అధినాయ‌క‌త్వం త‌న చేతుల్లోనే ఉన్న‌దన్నారు. “లోక్ జనశక్తి పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం లోక్‌స‌భ‌లో త‌మ పార్టీకి ఎవరు నాయకులు అన్న‌ది నిర్ణయించే అధికారం పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు ఉంటుంది. ఎల్జేపీ పార్టీ నాయకుడిగా ఎంపీ పశుపతి కుమార్ పరాస్‌ను ప్రకటించిన నిర్ణయం లోక్‌స‌భ‌లో మా పార్టీ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం” అని పేర్కొన్నారు. పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన ఐదుగురు ఎంపీల‌ను పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యులు స‌స్పెండ్ చేసిన‌ట్లు చెప్పారు. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ‌లో ఎల్జేపీ నేత‌గా త‌న పేరునే ప్ర‌క‌టిస్తూ కొత్త‌గా ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను లేఖ ద్వారా చిరాగ్ పాశ్వాన్ కోరారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ పాశ్వాన్ లేఖ‌
లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ పాశ్వాన్ లేఖ‌
లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ పాశ్వాన్ లేఖ‌

ట్రెండింగ్‌

Advertisement