మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 11:57:16

'వారం రోజులు సన్యాసి వలె జీవిద్దాం'

'వారం రోజులు సన్యాసి వలె జీవిద్దాం'

హైదరాబాద్‌ : మనమంతా వారం రోజులపాటు సన్యాసి వలె జీవిద్దామని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా యధేచ్ఛంగా గుంపులు, గుంపులుగా సంచరిస్తున్నారు. దీనిపై సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... స్వీయ నిగ్రహాన్ని పాటిస్తూ ఇళ్ల నుండి బయటకు రాకపోవడం. అనవసర వస్తువులు కొనకపోవడం వంటి చర్యలతో వారం రోజుల పాటు అందరం సన్యాసి వలె జీవించాలన్నారు. ఈ చర్యలు కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఖచ్చితంగా సహాయపడుతాయన్నారు. లేకపోతే రాబోయే కొద్ది నెలలు మనమంతా అనిశ్చితితో జీవించాల్సి వస్తుందన్నారు. మన నిర్లక్ష్యం కారణంగా మన కుటుంబాలు బాధపడుతాయని పేర్కొన్నారు.


logo