శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 10:23:26

ఒమ‌ర్ అబ్దుల్లాపై లాక్‌డౌన్‌ జోకులు..

ఒమ‌ర్ అబ్దుల్లాపై లాక్‌డౌన్‌ జోకులు..

హైద‌రాబాద్‌: సోష‌ల్ మీడియాలో ఒమ‌ర్ అబ్ధుల్లాపై కొన్ని జోకులు పేలుతున్నాయి.  సుమారు 236 రోజుల పాటు ఒమ‌ర్ గృహ నిర్బంధంలో ఉన్నారు. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ఎత్తివేసిన నేప‌థ్యంలో ఆయ‌న్ను నిర్బంధించారు. ఆయ‌న‌తో పాటు అనేక మంది క‌శ్మీరీ నేత‌ల‌ను హౌజ్ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే మంగ‌ళ‌వారం ఆయ‌న్ను రిలీజ్ చేశౄరు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆయ‌న రిలీజైన రోజునే.. కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది.  దీంతో ఒమ‌ర్ ఇంటికే ప‌రిమితం కావాల్సి వ‌స్తోంది.  క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. 236 రోజుల గృహ నిర్బంధం ముగిసినా.. మ‌ళ్లీ లాక్‌డౌన్ త‌ప్ప‌లేద‌ని కొంద‌రు సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. వాటిపై ఒమ‌ర్ అబ్దుల్లా పాజిటివ్‌గా స్పందించారు.  ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యాల్లో లైట్‌ జోకులు వేసినా.. అవి న‌న్ను బాధించ‌వు అని ఒమ‌ర్ ఓ ట్వీట్ చేశారు. 


logo