శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 27, 2020 , 13:51:54

ఈ బుడ్డోడు ఆడుకునే పూల్ టేబుల్ త‌యారు చేశాడు.. భ‌లే ఐడియా గురూ!

ఈ బుడ్డోడు ఆడుకునే పూల్ టేబుల్ త‌యారు చేశాడు.. భ‌లే ఐడియా గురూ!

ప్ర‌తి ఆవిష్క‌ర‌ణ‌కు అవ‌స‌రం ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ సామెత ఈ వీడియోకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆడుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. ఎప్పుడూ వీధి ఆట‌లే కాకుండా క్యార‌మ్స్‌, చెస్, పూల్ టేబుల్ కూడా ఆడాల‌ని ఉంటుంది. కానీ కొనేందుకు చేతిలో డ‌బ్బు ఉండ‌దు. డ‌బ్బులేద‌ని ఇష్టం పోదు క‌దా. అందుకే ఇటుక‌ల‌తో పూల్ టేబుల్ త‌యారు చేశాడో పిల్లాడు. త‌న ప‌నులు తాను చేసుకోవ‌డం కూడా చేత‌గాని వ‌య‌సులో ఈ ఆవిష్క‌ర‌ణ‌కు పూనుకున్నాడు.

ఇంత‌కుముందు నేల‌మీద క్యార‌మ్ బోర్డు గీసుకొని ఆడిన ముచ్చ‌ట బాగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దాన్ని మించిన ఆవిష్క‌ర‌ణ ఇది. 30 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ఒక బుడ్డోడు కొన్ని బంతులు, చేతిలో క‌ర్ర తీసుకొని ఆడుతూ క‌నిపించాడు. ఈ వీడియోను జ‌న‌ర‌ల్ జ్ఞాన్ భూష‌ణ్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అత‌నితోపాటు, త‌న స్నేహితులు కూడా ఆనందంగా ఆడుతున్న వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. ఈ ఆలోచ‌న సృజనాత్మకంగానే కాకుండా, వినూత్నంగా కూడా ఉంది. "రియల్ వినూత్నమైనది" అనే శీర్షిక‌తో పోస్ట్ చేశారు. ఇత‌ని తెలివితేట‌ల‌కు ఫ్యూచ‌ర్ ఛాంపియ‌న్, పిల్లలు తమ ఆనందాన్ని కనుగొనడంలో నిపుణులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


logo