మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 19:59:18

ప‌క్షుల‌కు ఆహారం పెట్ట‌డ‌మంటే పిల్ల‌ల‌కు భ‌లే స‌ర‌దా క‌దా!

ప‌క్షుల‌కు ఆహారం పెట్ట‌డ‌మంటే పిల్ల‌ల‌కు భ‌లే స‌ర‌దా క‌దా!

పిల్ల‌ల వీడియోలు ఎన్ని చూసినా ఇంకా ఇంకా చూడాల‌నిపిస్తుంది. ఈ వీడియో కూడా అంతే.. ముద్దు ముద్దుగా భ‌లే అనిపిస్తుంది. అన్నం తిన‌డం కూడా స‌రిగా చేత‌గాని ఈ పిల్లాడు ప‌క్షుల‌కు ‌ఆహారం తినిస్తున్న వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. హృద‌యాన్ని విద్యావంతుల‌ను చేయ‌కుండా మ‌న‌స్సును విద్యావంతుల‌ను చేయ‌డంలో అర్థం లేదు. మ‌నం ప్రేమ‌తో పుట్టామ‌ని పిల్ల‌ల‌కు నేర్పిద్దాం అనే శీర్షిక‌ను జోడించాడు.

ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక స్పూన్ స‌హాయంతో ప్లేట్ నుంచి ప‌క్షుల‌కు ఒక్కొక్క‌టిగా చాలా ఓపిగ్గా తినిపించాడు. ప‌క్షులు కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 'ఇది నిజమైన విద్య. మిగతా వారందరూ కేవలం సమాచారాన్ని సేకరిస్తున్నారు' అని ఒక వినియోగ‌దారుడు కామెంట్ చేశాడు. 

 

   


logo