బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 17:25:55

వైన్స్‌ షాప్‌లోకి దూరీ మందు ఎత్తుకెళ్లారు..

వైన్స్‌ షాప్‌లోకి దూరీ మందు ఎత్తుకెళ్లారు..

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తరిస్తుండంటో దాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా నిత్యావసరాలకు సంబంధించిన షాపులు, రవాణా వాహనాలు మినహా అన్ని మూతపడ్డాయి. ఈ నేపధ్యంలో కర్ణాటకలోని గండగ్‌ జిల్లాలో గురువారం ఉదయం ఓ మద్యం షాపులో భారీ చోరీ జరిగింది. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, మొత్తం రూ.1.5 లక్షల విలువైన మద్యం చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఆబ్కారీశాఖ, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
logo