శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 13:40:54

బోల్తాప‌డిన వైన్ ట్ర‌క్కు.. వారికి ఇక‌ పండ‌గే పండ‌గ‌!

బోల్తాప‌డిన వైన్ ట్ర‌క్కు.. వారికి ఇక‌ పండ‌గే పండ‌గ‌!

నోట్ల ట్ర‌క్కు బోల్తా ప‌డితే.. క‌రోనా నేప‌థ్యంలో దాని ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్లేవారు కాదేమో. అదే వైన్ ట్ర‌క్కు బోల్తాప‌డితే ఆగుతారా?  వైర‌స్ లేదు ఏం లేదు. హాం ఫ‌ట్.. అంటూ బాటిళ్ల‌ను ఎగ‌బ‌డి మ‌రీ తీసుకుంటారు. చేతి‌లో ఎన్న‌ని ప‌డుతాయి. అందుకే గోన సంచులు చేత‌ప‌ట్టి చింత‌కాయ‌లు ఏరిన‌ట్టు ఏరుకొని బాటిళ్ల‌ను సంచిలో వేసుకుంటున్నారు. మ‌రికొంద‌రైతే క‌ట్టుకున్న లుంగీల‌నే సంచులుగా మార్చుకున్నారు.

రోడ్డు మీదుగా వెళ్తున్న చ‌దువుకున్న‌వాళ్లు, చ‌దువుకోని వారంతా ట్ర‌క్కులో ఉన్న అట్ట పెట్టెల‌ను అరేంజ్ చేసుకొని ఎంచెక్కా య‌జ‌మానుల్లా సంక‌న పెట్టుకొని ప‌ట్టుకుపోతున్నారు. మ‌రి ఆ ట్ర‌క్కు డ్రైవ‌ర్‌, అందులో ఉన్న‌వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎవ‌రి బాధ వారిది అన్న‌ట్లుంది వ్య‌వ‌హారం. ఈ సంఘ‌ట‌న చెన్నై హైవే మీద చోటు చేసుకున్న‌ది.


logo